'సామి 2' సినిమా వీలైనంత త్వరగా సెట్స్‌పైకి ..
- August 09, 2016
సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేసే నటుడు విక్రం. తాజాగా ఆయన నటించిన 'ఇరుముగన్' ట్రైలర్‌ను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సైన్స్ ఫిక్షన్ కథతో దీన్ని రూపొందించారు. నయనతార, నిత్యామేనన్ కథానాయికలు. ఈ సినిమా తర్వాత నటుడు విక్రం 'గరుడ' సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే 'ఇరుముగన్' ఆడియో విడుదల సమయంలో 'సామి 2' సినిమా గురించి ప్రకటించారు. విక్రం నటించిన 'సామి' చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తమ అభిమాన హీరోను మళ్లీ పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో చూడటానికి ఉత్సుకత చూపుతున్నారు. అంతేకాక 'గరుడ' సినిమా కొన్ని కారణాలతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. అందుకే హరి దర్శకత్వంలోని 'సామి 2' సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని విక్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







