బహ్రెయిన్ లో మిడ్ డే వర్క్ నిషేధంపై అవగాహన..!!
- June 09, 2026
మనామా: సమ్మర్ లో మిడ్ డే వర్క్ నిషేధాన్ని నియంత్రించే 2026 నాటి మంత్రివర్గ నిర్ణయం నెం. (5) అమలు పై అవగాహన కల్పించేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక వర్క్ షాప్‌ను నిర్వహించింది.
జూన్ 15 నుండి ఆగస్టు 31 వరకు అమల్లో ఉండే ఈ నిషేధం, వేసవిలో తీవ్రమైన వేడి నుండి కార్మికులను కాపాడటానికి, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నేరుగా సూర్యరశ్మి తగిలే బహిరంగ ప్రదేశాలలో పని చేయడాన్ని నిషేధించారు.
ఈ వర్క్‌షాప్‌లో నియంత్రణ అవసరాలు మరియు పాటించవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఇందులో యజమానులు, ఆరోగ్య అధికారులు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినప్పుడు, ఈ నిర్ణయం అమలును పర్యవేక్షించడానికి మరియు ఆరోగ్యం, భద్రతా ప్రమాణాలపై అవగాహనను బలోపేతం చేయడానికి తాము చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







