ఒక్కో క్లెయిమ్ పై Dh25,000 సేవ్..వ్యాట్ రీఫండ్ పరిధి విస్తరణ..!!
- June 09, 2026
యూఏఈ: యూఏఈ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) కొత్త రెసిడెన్సీ యూనిట్లను నిర్మించుకుంటున్న యూఏఈ జాతీయుల కోసం వ్యాట్ రీఫండ్ పొందే పరిధిని విస్తరించింది. దీనివల్ల వారు ఒక్కో క్లెయిమ్ పై సుమారుగా 25,000 దిర్హమ్స్ ఆదా చేసుకోగలుగుతారని పేర్కొన్నది.ఈ విస్తరణతో యూఏఈ జాతీయులకు సుమారుగా 200 మిలియన్ దిర్హమ్స్ వ్యాట్ ఆదా అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.
2026 సంవత్సరానికి సంబంధించి రీఫండ్ క్లెయిమ్‌ల మొత్తం విలువ 1 బిలియన్ దిర్హమ్‌లను మించిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2025లో సుమారుగా 754 మిలియన్ దిర్హమ్‌లుగా ఉంది.
2026, జనవరి 1 తర్వాత సమర్పించిన ఎమిరేటీ గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యాట్ రీఫండ్ క్లెయిమ్‌లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు డిజిటల్ వ్యాట్ రీఫండ్ ప్లాట్‌ఫారమ్‌ను అప్‌డేట్ చేసినట్లు ఎఫ్‌టిఎ డైరెక్టర్-జనరల్ అబ్దుల్ అజీజ్ అల్ ముల్లా తెలిపారు.
నిబంధనలు
ఈ కొత్త పథకం కింద, యూఏఈ పౌరులు తమ కొత్త రెసిడెన్సీ యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట ఖర్చులపై వ్యాట్ రీఫండ్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే, నివాసంలో భాగంగా ఉండే వస్తువులకు, ఫిట్టింగ్‌లకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. ఇంకా ఈ పథకం కింద వాచ్‌మెన్‌లు, డ్రైవర్లు లేదా గృహ కార్మికుల సిబ్బంది గదులు, హోమ్ జిమ్ మరియు గేమ్ రూమ్ ఉన్నాయని అల్ ముల్లా పేర్కొన్నారు. అలాగే, ఇంటిగ్రేటేడ్ భద్రతా మరియు స్మార్ట్ హోమ్ వ్యవస్థలు, గ్యారేజ్, ఎలక్ట్రానిక్ లేదా స్మార్ట్ డోర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటైన్లు, ఇండోర్ వాటర్ ఫీచర్లు, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి కూడా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







