అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ....తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- June 09, 2026
హైదరాబాద్: దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.ఇది ప్రధాని నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ మేరకు లోక్ భవన్ మంగళవారం సాయంత్రం పత్రికా ప్రకటన విడుదల చేస్తుంది .
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణ, అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ పెంపు వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని గవర్నర్ శివ ప్రతాప్ పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలోనూ కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు.
‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధన దిశగా చేపడుతున్న కార్యక్రమాలు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దనున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరిన్ని విజయాలు సాధించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
“తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి, సుసంపన్నత సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







