ఇరాన్ దాడులను ఖండించిన ఖతార్..!!
- June 10, 2026
దోహా: కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్ లపై ఇరాన్ జరిపిన దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, అంతర్జాతీయ చట్ట నిబంధనలను బహిరంగంగా అతిక్రమించడమేనని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ దాడుల పర్యవసానాల నుండి ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కృషి చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
కువైట్, బహ్రెయిన్ మరియు జోర్డాన్లకు పూర్తి సంఘీభావాన్ని తెలియజేసింది.అలాగే తమ సార్వభౌమాధికారం మరియు భద్రతను కాపాడుకోవడానికి ఆ దేశాలు తీసుకునే అన్ని చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఖతార్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







