మల్కాజ్గిరి కమిషనర్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

- June 10, 2026 , by Maagulf
మల్కాజ్గిరి కమిషనర్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
హైదరాబాద్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” (ARRIVE ALIVE) కార్యక్రమం, నాలుగో దశ కింద తెలంగాణ పోలీస్ శాఖ, సంబంధిత అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ మరియు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
 
ఈ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు ప్రధాన బ్లాక్ స్పాట్ల వద్ద డీసీపీ స్థాయి అధికారులు, రోడ్డు భద్రత భాగస్వామ్య శాఖల ప్రతినిధులతో కలిసి విస్తృత రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు ఈరోజు (10.06.2023) నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల పరిస్థితి, అవగాహన కార్యక్రమాలు, ప్రమాదాల నిర్వహణ మరియు రోడ్డు భద్రత చర్యలపై సమీక్ష నిర్వహించబడింది. అనంతరం నేరేడ్‌మెట్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మరియు మున్సిపల్ కమిషనర్ మీడియా సమావేశం @ 3.30 pm నిర్వహించారు.
 
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌తో పాటు డీసీపీ స్థాయి అధికారులు క్రింది ఐదు ప్రధాన బ్లాక్ స్పాట్ల వద్ద అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు:
 
1. కుంట్లూర్ టీ-జంక్షన్, హయత్‌నగర్–మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, డీసీపీ ఎల్‌బీ నగర్ మరియు డీసీపీ రోడ్డు భద్రత ఆధ్వర్యంలో.
 
2. కొత్తగూడెం ఎక్స్ రోడ్ యూ-టర్న్, అబ్దుల్లాపూర్‌మెట్–డీసీపీ ట్రాఫిక్-II ఆధ్వర్యంలో.
 
3. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ జంక్షన్–డీసీపీ మల్కాజిగిరి ఆధ్వర్యంలో.
 
4. ఉప్పల్ ఎక్స్ రోడ్స్–డీసీపీ ఉప్పల్ ఆధ్వర్యంలో.
 
5. రాథిఫైల్ బస్ స్టాండ్ సిగ్నల్, సికింద్రాబాద్–డీసీపీ ట్రాఫిక్-I ఆధ్వర్యంలో.
 
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మొత్తం 401.8 కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్ ఉంది. ఇందులో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్ మరియు ప్రధాన జిల్లా రహదారులు ఉన్నాయి. 2026 జనవరి నుండి మే వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల విశ్లేషణలో మొత్తం 1,466 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయి. అదే కాలంలో 134 ప్రాణాంతక ప్రమాదాలు చోటుచేసుకుని 143 మంది మృతి చెందారు, ఇది గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గుదలను సూచిస్తోంది.
 
ఈ సమీక్షలో (43) బ్లాక్ స్పాట్లు మరియు (20) హాట్ స్పాట్లు తక్షణ జోక్యం అవసరమైన ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. 2025 సంవత్సరంలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 50 బ్లాక్ స్పాట్లు గుర్తించబడగా, వాటిలో 342 ప్రాణాంతక మరియు తీవ్ర గాయాల ప్రమాదాలు సంభవించి 232 మంది మరణించారు.
 
అన్ని రహదారులలో ఎన్‌హెచ్-65 (విజయవాడ హైవే) అత్యంత ప్రమాదకర మార్గంగా గుర్తించబడింది. 2026 (మే వరకు) ఈ మార్గంలో 259 ప్రమాదాలు జరిగి 17 మంది మృతి చెందారు.
 
రోడ్డు భద్రత భాగస్వామ్య శాఖలతో సమన్వయం చేసుకొని కమిషనరేట్ క్రింది తక్షణ చర్యలను ప్రతిపాదించింది:
 
గుర్తించిన బ్లాక్ స్పాట్ల సవరణ
 
రోడ్డు ఇంజినీరింగ్ మెరుగుదలలు
 
హెచ్చరిక మరియు జాగ్రత్త సూచిక బోర్డుల ఏర్పాటు
 
హైవే పెట్రోలింగ్ బలోపేతం
 
ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాల ఏర్పాటు
 
ట్రాఫిక్ అమలు చర్యల బలోపేతం
 
పోలీస్ కమిషనర్ ప్రజలను ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, అధిక వేగంతో వాహనాలు నడపవద్దని, హెల్మెట్లు మరియు సీట్ బెల్ట్లు తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ సమయంలో సహాయం చేయాలని కూడా ప్రజలను కోరారు.
 
రాహ్-వీర్ (గుడ్ సమారిటన్) పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే అర్హులైన వ్యక్తులకు రూ.25,000 నగదు బహుమతి అందజేయబడుతుంది. అదనంగా, పీఎం రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందించబడుతుంది.
 
సొలాటియం పథకం – 1989 ప్రకారం, మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 161 మరియు తదనంతర సవరణల మేరకు హిట్ అండ్ రన్ ప్రమాద బాధితులకు పరిహారం మంజూరు చేయబడుతుంది.
 
పరిహారం వివరాలు:
మరణించిన వారి కుటుంబాలకు – రూ.2,00,000/-
తీవ్రంగా గాయపడిన వారికి – రూ.50,000/-
సెప్టెంబర్ 2021 నుండి మార్చి 2026 వరకు మొత్తం 401 పరిహార దరఖాస్తులు మూడు జిల్లా కలెక్టరేట్లకు పంపించబడ్డాయి. వీటిలో 32 కేసులకు రూ.16,12,500 పరిహారం మంజూరు చేయబడగా, మిగిలిన 369 కేసులకు ఆమోద ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నాయి.
అరైవ్ అలైవ్ కార్యక్రమాలు
మొదటి దశ (Jan, 2026)
 
నిర్వహించిన కార్యక్రమాలు: 654
హాజరైన ప్రజలు: 39,308
 
రెండవ దశ (Feb, 2026)
 
నిర్వహించిన కార్యక్రమాలు: 470
 
హాజరైన ప్రజలు: 18,037
 
మూడవ దశ (Mar, 2026)
 
నిర్వహించిన కార్యక్రమాలు: 458
 
హాజరైన ప్రజలు: 17,026
 
నాలుగవ దశ (Apr, 2026 to ….)
 
నిర్వహించిన కార్యక్రమాలు: 410
 
హాజరైన ప్రజలు: 21,210
 
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడం మరియు రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడం కోసం అన్ని భాగస్వామ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com