దుబాయ్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
- June 10, 2026
దుబాయ్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.. మృతదేహాల తరలింపునకు దుబాయ్‌కు పయనం
కరీంనగర్: దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన వలస కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు డా.మేడిపల్లి సత్యం స్వయంగా దుబాయ్‌కు బయలుదేరారు.
దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు ప్రవాస తెలంగాణ కార్మికులు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
లారీ సాంకేతిక లోపంతో రోడ్డుపై ఆగి ఉండగా, వెనుక నుంచి వచ్చిన మినీబస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం పలువురు ప్రాణాలు కోల్పోగా, వారిలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు.
మృతులు:
- సయ్యద్ సలీం (51) – నమికొండ గ్రామం, కొడిమ్యాల మండలం
- గొల్లపల్లి తిరుపతి గౌడ్ (42) – తక్కల్లపల్లి గ్రామం, మల్యాల మండలం
- అబ్బుల్ రఫీక్ (37) – గాజులపేట, మెట్‌పల్లి మండలం
మృతదేహాల తరలింపుకు చర్యలు
మృతుల కుటుంబాల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం స్వయంగా దుబాయ్ వెళ్లి మృతదేహాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు భారతీయ కాన్సులేట్ అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి, అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.
అలాగే ప్రమాదంలో గాయపడిన చొప్పదండి నియోజకవర్గానికి చెందిన బాధితుల పరిస్థితిని తెలుసుకుని, వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రవాస తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం అండ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విదేశాల్లో ఉపాధి కోసం కష్టపడుతున్న తెలంగాణ కార్మికులకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.
--నారాయణ గుళ్ళపల్లి (మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







