CMYF మస్కట్ టీం హెడ్ చందక రాందాస్‌కు ప్రత్యేక గుర్తింపు
- June 11, 2026
మస్కట్: ఒమాన్‌లో భారత రాయబారిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి వీడ్కోలు తీసుకుంటున్న సందర్భంగా మాజీ భారత రాయబారి జి.వి.శ్రీనివాస్, సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన CMYF మస్కట్ హెడ్ చందక రాందాస్ ని ప్రత్యేకంగా సన్మానించారు.
మస్కట్‌లో ఉన్న కాలమంతా సామాజిక సేవను ఒక ఉద్యమంలా కొనసాగిస్తూ, తెలుగు కమ్యూనిటీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన రాందాస్, ఆపదలో ఉన్న వారికి “నేనున్నా” అనే భరోసా కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు ప్రజలకు అండగా నిలుస్తూ ఆయన సేవలను గుర్తించిన శ్రీనివాస్ ప్రత్యేక ధృవీకరణ పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సన్మానం కేవలం చందక రాందాస్ కే కాకుండా, మొత్తం తెలుగు కమ్యూనిటీకి దక్కిన గౌరవంగా పలువురు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా ఆయన ఆదర్శ వ్యక్తిత్వం, సేవా తపన, మానవతా దృక్పథానికి లభించిన అరుదైన గుర్తింపుగా కమ్యూనిటీ సభ్యులు కొనియాడుతున్నారు.
తెలుగు సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాందాస్ కి లభించిన ఈ గౌరవం, భవిష్యత్తులో మరింత మంది సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తినిస్తుందని పలువురు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







