షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- June 12, 2026
షార్జా: షార్జాలో హత్యకు గురైన ఒక భారతీయుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించనున్నట్లు ఈ కేసును పర్యవేక్షిస్తున్న యాబ్ లీగల్ సర్వీసెస్ (Yab Legal Services) సీఈఓ సలామ్ పాప్పినీస్సేరి చెప్పారు. షార్జా ఫోరెన్సిక్ విభాగం మసీదులో 'అసర్' ప్రార్థనల తర్వాత ఆయన అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయన్నారు. ఆయన మృతదేహాన్ని రాత్రి 10:40 గంటలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో తరలించినట్లు తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని కన్నూర్‌లో ఉన్న ఆయన స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లే సమయంలో ఆయన సోదరుడు కూడా తోడుగా ఉన్నాడని తెలిపారు.
సోషల్ మీడియా వీడియో విషయంలో జరిగిన వివాదంలో 40 ఏళ్ల భారతీయుడు హత్యకు గురయ్యాడు. మరణించిన వ్యక్తి టిక్‌టాక్ లైవ్ సెషన్లో అనుమానితుడితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అనుమానితుడు బాధితుడిని షార్జాలో కలువమని సవాలు విసిరి, రాగానే హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ఆన్లైన్ శత్రుత్వం ఉన్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని వేగవంతంగా భారత్ కు తరలించేందుకు సహాయపడిన వారందరికి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిక్ కృషిని సలామ్ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









