కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- June 12, 2026
కువైట్: కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ ముగిసింది. భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) సహకారంతో కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం జూన్ 1 నుండి 11 వరకు విజయవంతంగా నిర్వహించింది. భారతదేశపు అత్యుత్తమ మామిడి రకాలను పరిచయం చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అనేక ప్రచార కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించారు.
ప్రపంచంలోనే మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతదేశం, వివిధ ప్రాంతాలలో పండించే వందలాది రకాల మామిడి పండ్లకు నిలయంగా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో అల్ఫోన్సో, బంగనపల్లె, బాదామి, కేసర్, దసరి, లంగ్రా, నీలం, ఫజ్లీ, మరియు మల్లిక, అమ్రపాలి వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఇవన్నీ వాటి ప్రత్యేకమైన రుచులు, పోషక విలువలు మరియు అత్యుత్తమ నాణ్యతకు ప్రసిద్ధి చెందినవి.
ఈ వేడుకలలో భాగంగా అత్యుత్తమ నాణ్యత గల భారతీయ మామిడి పండ్లతో పాటు మామిడి సలాడ్, మామిడి సోర్బెట్ మరియు మామిడి మిల్క్‌షేక్‌లతో సహా పలు రకాల మామిడి ఆధారిత వంటకాలను సందర్శకు ఆస్వాదించారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









