QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- June 12, 2026
దోహా: ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1) రెసిడెన్షియల్ యూనిట్ల సేల్స్ సంఖ్య 1,582కి చేరుకుంది. 2025 మొదటి త్రైమాసికంతో (Q1 2025) పోలిస్తే లావాదేవీల సంఖ్య 15% పెరగింది. ప్రపంచ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తాజా ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సమీక్ష ప్రకారం.. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరియు వినియోగదారుల నిర్ణయాలపై ప్రభావం చూపాయి. దీంతో 2026 మొదటి త్రైమాసికంలో (Q1) ఖతార్ రెసిడెన్షియల్ మార్కెట్ కార్యకలాపాలలో మందగమనం కనిపించింది.
ఇక రెసిడెన్షియల్ యూనిట్ల మార్కెట్ కార్యకలాపాలకు దోహా కేంద్రంగా నిలిచింది. ఇక్కడ సుమారుగా QR2.6 బిలియన్ల విలువైన 512 లావాదేవీలు నమోదయ్యాయి. కాగా, అల్ రాయన్ రెండవ అత్యంత చురుకైన మునిసిపాలిటీగా నిలిచింది. ఇక్కడ QR1.38 బిలియన్ల విలువైన 280 లావాదేవీలు జరిగాయని నివేదిక పేర్కొంది.
సగటు విల్లా ధరలు వార్షిక ప్రాతిపదికన 3.5% తగ్గి చదరపు మీటరుకు QR6,626కు చేరాయి. కాగా అపార్ట్‌మెంట్ ధరలు 1.7% తగ్గి చదరపు మీటరుకు QR13,049కి పడిపోయాయి. మార్కెట్ మందగించినప్పటికీ, ప్రధాన వాటర్‌ఫ్రంట్ ప్రాజెక్టులు మెరుగైన పనితీరును కొనసాగించాయి, 'ది వాటర్‌ఫ్రంట్'లో చదరపు మీటరుకు సగటు అపార్ట్‌మెంట్ ధరలు QR15,194గా నమోదయ్యాయి.
ఈ త్రైమాసికంలో ఖతార్ మార్టిగేజ్ మార్కెట్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. గృహ రుణ (మార్ట్‌గేజ్) లావాదేవీల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 12.4% తగ్గి 283కి పరిమితమైంది. మంజూరు చేసిన రుణాల మొత్తం విలువ మాత్రం 85% పెరిగి సుమారు QR17.2 బిలియన్లకు చేరింది.
2026 మొదటి త్రైమాసికంలో రెసిడెన్షయన్ల రెంట్ మార్కెట్ కూడా మందగించింది.ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అద్దెదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల, విల్లాల సగటు నెలవారీ అద్దె 8.9% తగ్గి QR13,908కి చేరగా, అపార్ట్‌మెంట్ అద్దెలు 13.3% తగ్గి QR9,492కి పడిపోయాయి.
ఖతార్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ స్థిరంగా ఉంది. సగటు కార్యాలయ అద్దె ఏడాది ప్రాతిపదికన 3.2% తగ్గి నెలకు చదరపు మీటరుకు QR77గా నమోదైంది. వెస్ట్ బే మరియు లుసైల్ వంటి ప్రధాన ప్రాంతాలలో డిమాండ్ కొనసాగగా, ఖాళీగా ఉన్న స్థలాలు ఎక్కువగా ఉండటం మరియు కొత్త 'గ్రేడ్-ఎ' భవనాల నుండి పోటీ పెరగడం వల్ల ద్వితీయ శ్రేణి కార్యాలయ ప్రాంతాలలో అద్దెలపై ఒత్తిడి కనిపించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







