రావు బహదూర్ తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమా: హీరో సత్యదేవ్
- June 12, 2026
-జిఎంబి ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్స్, సత్యదేవ్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ 'రావు బహదూర్' నెవర్ బిఫోర్ 'నాట్ ఎ టీజర్' లాంచ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్టైన్మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, అలాగే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘ఓ సుందరి’ పాట సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. 'ఇంటు ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్' వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోజు, చిత్ర నిర్మాతలు 'నాట్ ఎ టీజర్'ను లాంచ్ చేశారు.
మూడు నిమిషాల పది సెకన్ల నిడివి గల ఈ వీడియో, కథానాయకుడి విచిత్రమైన, రహస్యాలతో నిండిన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తి.. ప్రాణాంతకమైన లివర్ క్యాన్సర్‌తో బాధపడుతూ, మరణం నీడలో జీవిస్తున్నప్పటికీ, వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ అతడు బతికే పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఆ ప్రయాణం ఒక అద్భుతంగా మారుతుంది. అనంతరం కథ గతం, వర్తమానం మధ్య ప్రయాణిస్తూ అతని యవ్వన దశ, ఒక అందమైన యువతితో ప్రేమకథ, అలాగే అతని అసాధారణ జీవితంలోని ఎన్నో రహస్యాలని ఆవిష్కరిస్తుంది.
ఈ వీడియోలో సత్యదేవ్ చేసిన అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్లిష్టమైన పాత్రల్లో పూర్తిగా లీనమయ్యే నటుడిగా పేరున్న సత్యదేవ్, ఈ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. వాస్తవం, భ్రమల మధ్య చిక్కుకుని ఒంటరితనం, అంతర్మథనం, భావోద్వేగాలతో సతమతమయ్యే వ్యక్తిగా ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు తన కెరీర్లో కనిపించని కొత్త లుక్, కొత్త హావభావాలతో సత్యదేవ్ ఈ పాత్రకు ప్రాణం పోశారు.
సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా కనిపించగా, వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషించారు.
సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. వెంకటేష్ మహా తన ప్రత్యేకమైన విజన్‌తో కథనానికి సరికొత్త సినీ అనుభూతిని అందించారు. ‘రావు బహదూర్’ ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచే అన్ని లక్షణాలు కలిగి ఉందనే ఫీలింగ్ ఈ వీడియో కలిగిస్తుంది.
ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్ సృష్టించిన ప్రపంచం ఎంతో సహజంగా, గొప్పగా, దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పరమార్ విజువల్స్‌కు ప్రత్యేకమైన అందాన్ని తీసుకురాగా, స్మరణ్ సాయి అందించిన నేపథ్య సంగీతం మిస్టరీ, ఉత్కంఠను మరింతగా పెంచింది.
విభిన్నమైన విజువల్ లాంగ్వేజ్, అద్భుతమైన నటన, ఆసక్తికరమైన కథాంశంతో ‘రావు బహదూర్’ తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రావు బహదూర్ జూలై 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. జ్యోతి లక్ష్మి సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. పూరి గారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. ఇప్పుడు రావు బహదూర్ టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఏ ఇండస్ట్రీలోనైనా ఒక మంచి, క్రేజీ సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు దాన్ని సపోర్ట్ చేస్తారు. జూలై 3న మా రావు బహదూర్ సినిమా కూడా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని మిగతా ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా అంతే స్థాయిలో ఆదరిస్తారని నమ్ముతున్నాను. తెలుగులో ఒక క్రేజీ ఫిల్మ్ వచ్చిందని గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, రావు బహదూర్ సినిమా గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకుంటారు. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకులందరూ గర్వపడేలా ఈ సినిమాను చేశాము. వెంకటేష్ మహా తన ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశాడు. అనురాగ్ శరత్ అలాగే ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ సినిమాపై అపారమైన ప్యాషన్ ఉంది. మాకు సినిమా అంటే పిచ్చి. అలాంటి టీమ్‌లో భాగమైనందుకు నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. వెంకటేష్ మహా లాంటి దర్శకుడు సినిమాలు చేస్తున్న కాలంలో నేను నటుడిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జూలై 3న ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా షాక్ చేస్తుంది. జూలై 4 నా పుట్టినరోజు. మీరందరూ ఈ సినిమాను చూసి నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ ఆల్.
డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థాంక్యూ వెరీ మచ్. వాళ్లు ఈ సినిమాను అర్థం చేసుకుని, నమ్మారు కాబట్టే ఇది ఇక్కడివరకు వచ్చింది. ఇంత పెద్ద కొలాబరేషన్ చేసిన అనురాగ్, శరత్‌లకు కూడా ధన్యవాదాలు. ఈ సినిమా తీయడం అంత సులభమైన విషయం కాదు. చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సత్యతో నేను ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చేశాను. నా ఆలోచనలన్నీ తనతో పంచుకుంటాను. నాకు ఏం కావాలో అర్థం చేసుకుని, అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగల నటుడు సత్య. ఈ సినిమా కోసం ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేసుకునేవాడు. ఈ పాత్ర కోసం చాలా మ్యాడ్నెస్ను అనుభవించాడు. నన్ను నమ్మినందుకు థాంక్యూ సత్య. సత్య లాంటి నటుడు ఉన్న సమయంలో నేను దర్శకుడిగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీపా థామస్ తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పింది. ఈ సినిమా కోసం ఆమె కూడా చాలా కష్టపడింది. ఈ సినిమా నా జీవితంలో ఐదున్నర సంవత్సరాలు తీసుకుంది. ఇది నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రం. తెలుగు సినిమాలో కూడా ఇది కచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను.
హీరోయిన్ దీపా థామస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ బాబు గారికి థాంక్యూ. వారి బ్యానర్ ద్వారా తెలుగు సినిమాకి పరిచయం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇంత అద్భుతమైన కథతో, గొప్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. సత్యదేవ్ గారు అద్భుతమైన నటుడు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తన పాత్ర కోసం ప్రతిరోజూ ఐదు గంటల పాటు మేకప్ వేయించుకోవడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన పాత్రను పోషించిన ఆయనకు అభినందనలు. ఈ చిత్రంలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. గోపాలకృష్ణ రెడ్డి గారికి, అనురాగ్ గారికి, శరత్ గారికి థాంక్యూ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. జూలై 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తప్పకుండా థియేటర్లలో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
నిర్మాత శరత్ చంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను కేరాఫ్ కంచరపాలెం సినిమా చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. అంతలా ఆ సినిమా నన్ను కదిలించింది. ఇప్పటికే ఆ సినిమా IMDbలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మహా రావు బహదూర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా కూడా IMDbలో అగ్రస్థానానికి చేరుతుందని నమ్ముతున్నాను. మహేష్ బాబు గారికి ఈ కథ చెప్పిన రెండో వారంలోనే షూటింగ్‌కి వెళ్లిపోయాం. తర్వాత గోపాలకృష్ణ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. అందరం కలిసి సినిమాను చకచకా పూర్తి చేశాం. ఈ సినిమా కథపై ఇండస్ట్రీలో చాలామందికి ఆసక్తి ఉంది. కానీ ఇంత భారీ స్థాయిలో ఈ సినిమాను ఎలా చేస్తారని అనుకున్నారు. అయితే ఈ సినిమా మా పేరుపై రాసిపెట్టి ఉందని భావిస్తున్నాం. అది మా అదృష్టం. నేను ఈ సినిమా చూశాను. నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులు చూస్తే వాళ్లే ముందుకు తీసుకెళ్తారు. ఈ సినిమా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. సినిమా ముగిసిన తర్వాత కూడా మీతోనే ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. మీరు ఒక డ్రీమ్ వరల్డ్‌లోకి వెళ్లిన అనుభూతిని పొందుతారు. అంత ప్యాషన్‌తో, అంత పిచ్చితో ఈ సినిమా చేసిన మహాకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రేక్షకులు చాలా తెలివైనవారు. వారిని నమ్మి చేసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరం ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది.
నిర్మాత అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మహేష్ బాబు గారు తన కెరీర్లో చాలా రిస్క్ తీసుకుని సినిమాలు చేశారు. అలాగే ఆయన బ్యానర్లో వస్తున్న సినిమాలు కూడా కొత్తదనం, సాహసంతో కూడుకున్నవే. మేజర్ మీ అందరికీ ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇప్పుడు వస్తున్న రావు బహదూర్ కూడా అలాంటి ప్రత్యేకమైన అనుభూతినే అందించబోతోంది. జూలై 3న ఈ సినిమా విడుదల కానుంది. ఆ శుక్రవారం మిగతా శుక్రవారాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది నా ప్రామిస్. సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో, మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ల జాబితా తీస్తే ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. అంత అద్భుతమైన నటనను ఆయన ప్రదర్శించారు. అలాంటి గొప్ప నటుడితో సినిమా చేయడం మా గౌరవంగా భావిస్తున్నాం. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి మేమంతా స్టన్ అయిపోయాం. తన పాత్రను చాలా లోతుగా అర్థం చేసుకుని నటించారు. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పింది కూడా తక్కువేనని మీరే అనుకుంటారు. వెంకటేష్ మహా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు తాను అనుకున్న కాన్సెప్ట్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. సినిమా చూస్తున్న కొద్దీ నాకు అందులో కొత్త కొత్త లేయర్స్ కనిపిస్తున్నాయి. ఇందులోని ప్రతి డీటైల్ కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఒక తెలుగు దర్శకుడు ఎంత గొప్పగా ఆలోచించగలడో ఈ సినిమాతో మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు. స్మరణ తన మ్యూజిక్ తో ప్రతి సన్నివేశాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. దీపా చాలా అద్భుతమైన నటి. ఆమె ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. మహేష్ గారికి థాంక్యూ సో మచ్. జూలై 3న ఈ సినిమా వస్తోంది. కచ్చితంగా ఆ శుక్రవారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ అందరి సపోర్ట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.
నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రావు బహదూర్ లాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంటుంది. నమ్రత గారు ఈ కథను ఓకే చేసిన తర్వాత నాకు చెప్పారు. కథ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా సినిమా ఇవ్వాలని మేము ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. మహేష్ బాబు గారు, నమ్రత గారితో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సత్యదేవ్ గారి విశ్వరూపం చూస్తారు. ఆయన నటన చూసిన తర్వాత ఇంతకంటే ఈ పాత్రను ఇంకెవరు బాగా చేయగలరు అనే భావన కలుగుతుంది. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా విషయంలో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.
తారాగణం: సత్య దేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం, ఎడిటర్: వెంకటేష్ మహా
సమర్పణ: మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ GMB ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు: చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర
ప్రొడక్షన్ బ్యానర్స్: A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దినేష్ యాదవ్ బి
డీవోపీ: కార్తీక్ పర్మార్
సంగీతం: స్మరణ్ సాయి
ప్రొడక్షన్ డిజైనర్: రోహన్ సింగ్
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: ఎల్లో టూత్స్
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









