7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- June 14, 2026
రియాద్: సౌదీ భద్రతా అధికారులు జూన్ 4 మరియు జూన్ 10 మధ్య మొత్తం 10,725 మంది అక్రమ నివాసితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు 5,899 మంది, సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు 3,084 మంది మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు 1,742 మంది ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 7,989 మంది అక్రమ నివాసితులను బహిష్కరించినట్లు పేర్కొంది. అలాగే ప్రయాణ పత్రాలను పొందడానికి 14,268 మంది ఉల్లంఘనదారులను వారి దౌత్య కార్యాలయాలకు మరియు ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి 1,240 మందిని సంబంధిత విభాగాలకు పంపినట్లు పేర్కొంది.
చట్ట ఉల్లంఘనదారులకు రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించిన 18 మందిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపింది. అక్రమ నివాసితులకు సాయం చేసేవారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1 మిలియన్ సౌదీ రియాల్స్ (SR) వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చిరంచింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో ని 911 నంబర్కు, మిగిలిన ప్రాంతాలలో 999 మరియు 996 నంబర్లకు కాల్ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







