ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- November 23, 2026
దోహా: ఖతార్‌లో ఆధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. ఎలక్ట్రిక్ రోబోటాక్సీల పరీక్షల్లో భాగంగా రెండో దశను ప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MOT) ప్రకటించింది. మోవాసలాత్ (కర్వా) సంస్థ సమన్వయంతో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండో దశలో భాగంగా దోహా నగరంలో రెండు లెవల్-4 ఎలక్ట్రిక్ రోబోటాక్సీలను 12 నెలల పాటు పరీక్షించనున్నారు. ఇందుకోసం రవాణా మంత్రిత్వ శాఖ ముందుగానే గుర్తించి అనుమతించిన మార్గాలను ఎంపిక చేసింది.
ఓల్డ్ దోహా పోర్ట్, మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (MIA), సౌక్ వాకిఫ్, వెస్ట్ బే, షెరటాన్ దోహా హోటల్ నుంచి కార్నిష్ మీదుగా డిప్లొమాటిక్ స్ట్రీట్ చివరి వరకు ఈ వాహనాలు ప్రయాణించనున్నాయి. కాగా ఇప్పటికే నిర్వహించిన తొలి దశ పరీక్షలు ఆశించిన లక్ష్యాలను మించి విజయవంతమయ్యాయి. ఆటోమేటిక్ డ్రైవింగ్ విధానంలో ఈ వాహనాలు దాదాపు 10 లక్షల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేశాయి. తొలిదశలో నిర్దేశించిన 500,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని అధిగమించాయి. పనితీరు, భద్రతకు సంబంధించిన సూచికలు కూడా సంతృప్తికరంగా ఉండటంతో రెండో దశ పరీక్షలకు అధికారులు అనుమతి ఇచ్చారు.
ఈ రోబోటాక్సీలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. లిడార్ (LiDAR) సెన్సార్లు, రాడార్ వ్యవస్థలు, కెమెరాలు, ప్రత్యేక ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ల సహాయంతో వాహనాలు రహదారిపై పరిస్థితులను గుర్తిస్తూ ప్రయాణిస్తాయి. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా స్వయంచాలకంగా స్పందించేలా వీటిని రూపొందించారు. వాహనాల కార్యకలాపాలను రవాణా మంత్రిత్వ శాఖ, కర్వా సంస్థలు ప్రత్యేక కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తాయి.
ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రత, కార్యకలాపాల నిర్వహణ, డేటా రక్షణ ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు కొనసాగించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దశలవారీగా వాహనాల పనితీరును అంచనా వేసిన అనంతరం భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించే అవకాశాలను పరిశీలించనున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు







