బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- June 14, 2026
మనామా: 2026–2027 విద్యా సంవత్సర క్యాలెండర్ ను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీని ప్రకారం, బహ్రెయిన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సెప్టెంబర్ 1న విధుల్లో చేరనుండగా, విద్యార్థుల కోసం ఓరియంటేషన్ (పరిచయ) కార్యక్రమాలు సెప్టెంబర్ 2 మరియు 3 తేదీలలో నిర్వహించనున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 202 పని దినాలు ఉంటాయి. ఇందులో మొదటి సెమిస్టర్లో 91 రోజులు మరియు రెండవ సెమిస్టర్లో 111 రోజులు ఉంటాయి. విద్యా కార్యక్రమాలతో సహా అన్ని స్థాయిల పాఠశాలలకు మొదటి సెమిస్టర్ 2026 సెప్టెంబర్ 3 నుండి 2027 జనవరి 12 వరకు కొనసాగుతుంది.
జనరల్ సెకండరీ ఎడ్యుకేషన్, ప్యారల్లెల్ సెకండరీ ఎడ్యుకేషన్.. అలాగే టెక్నికల్ మరియు ఒకేషనల్ విద్యా విభాగాలకు సంబంధించిన వార్షిక పరీక్షలు 2026 డిసెంబర్ 21 నుండి 2027 జనవరి 12 వరకు జరుగుతాయి. జనరల్ ఇంటర్మీడియట్ పరీక్షలు డిసెంబర్ 28 నుండి, అలాగే బదిలీ మరియు ఇంటి వద్దే చదువుకునే (home-study) విధానానికి సంబంధించిన పరీక్షలు డిసెంబర్ 31 నుండి జనవరి 12 వరకు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







