అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- June 14, 2026
అబుదాబి: అబుదాబి భారత రాయబార కార్యాలయంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 13, 2026న అత్యంత వైభవంగా, సాంస్కృతిక శోభతో నిర్వహించబడ్డాయి. తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రతిఫలించాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్, ఫస్ట్ సెక్రటరీ–కమ్యూనిటీ వెల్ఫేర్, భారత రాయబార కార్యాలయం హాజరయ్యారు.గౌరవ అతిథిగా వి.ప్రకాశ్, మాజీ చైర్మన్–తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుండి బిజీ థామస్, లింసన్, బీహార్ మరియు ఝార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐ.ఎఫ్.సి.ఏ నుండి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుండి సంజయ్, ఇ.టి.సి.ఏ నుండి కిరణ్ కుమార్, సంస్కృతీ నుండి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్ మరియు భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది.అనంతరం డా.అందె శ్రీ మరియు తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.
తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గణపతి వందన, తెలంగాణ జానపద నృత్యాలు, దేశభక్తి గీతాలు, థీమ్ డాన్స్, చిన్నారుల పాటలు, మహిళల సమూహ నృత్యాలు—ప్రతి ప్రదర్శన తెలంగాణ ఆత్మను అద్భుతంగా ప్రతిబింబించింది.
చిన్నారులైన కవీష్, సంజన, అభిరామ్ చేసిన సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, మల్లేశ్ & టీమ్ చేసిన డప్పు–ఫోక్ ప్రదర్శన వేదికను కదిలించింది.
మొదటి సారి యాంకరింగ్ చేసిన కవీష్ మరియు సంస్కృతి తమ నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు.
కోర్ టీమ్ సభ్యులు జగదీశ్ మరియు యోగిత తమ ప్రతిభను మరోసారి నిరూపించగా, యోగిత తెలంగాణ సంస్కృతీ ని ప్రతిబింభించే మినిచర్ art వర్క్ అందరి ప్రశంసలు అందుకుంది. విజయలక్ష్మి చిత్రాలు వేదికకు మరింత అందాన్ని చేర్చాయి.
ముఖ్య అతిథులు తమ ప్రసంగాల్లో తెలంగాణ సంస్కృతి, భాష, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రశంసించారు. అనంతరం అతిథులకు, కమ్యూనిటీ నాయకులకు, స్పాన్సర్లకు ఘన సన్మానాలు నిర్వహించారు.రుచికరమైన భోజనాన్ని అందించిన సంక్రాంతి టీమ్, అందమైన గ్యాపికలు అందించిన డైమండ్ కార్ వాష్ యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మొత్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని మరియు అర్చన కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరిగా, కోర్ టీమ్ మొత్తం కార్యక్రమం అంతటా అండగా నిలిచినందుకు అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా మాట్లాడుతూ, “మనమందరం ఇదే ఉత్సాహంతో, ఐక్యతతో ముందుకు సాగుదాం.ఈ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.











తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







