సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- June 14, 2026
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి తెలుగు సంఘాలు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి సీఎంను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని పలకరించి, కొందరితో ఫోటోలు దిగారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ నగరాల సదస్సు (World Cities Summit)లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆయన సింగపూర్‌లోని పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.
అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అక్కడి మంత్రులు, అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా-జురాంగ్ ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో వరుసగా చర్చలు జరిపి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







