ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- June 17, 2026
మస్కట్: ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నకిలీ మరియు నాణ్యత లేని వైద్య ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాలను పర్యవేక్షించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో సురక్షితమైన వినియోగ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఒక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించినట్టు పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నియంత్రణ మరియు పర్యవేక్షక సంస్థ అయిన డ్రగ్ సేఫ్టీ సెంటర్ ఈ కీలక క్యాంపెయిన్ ను పర్యవేక్షిస్తుందని తెలిపింది.
ముఖ్యంగా వైద్య ఉత్పత్తులను విక్రయించడానికి విశ్వసనీయత లేని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్కువ ధర లేదా త్వరగా లభించే ఉత్పత్తులను కొనేముందు సరిచూసుకోవాలని కోరింది. అలాగే బరువు తగ్గించే ఉత్పత్తులు, ఆహార సప్లిమెంట్లు కోసం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఫేక్ ఉత్పత్తులు ఆకర్షణీయమైన ప్రకటనలతో మోసం చేస్తాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఈ ప్రచారంలో భాగంగా అనేక అవగాహన, శిక్షణ మరియు విద్యా కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించబడతాయని తెలిపింది. అలాగే, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు వివిధ మీడియా మాధ్యమాలలో కూడా అవగాహన మరియు మీడియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
నకిలీ మందులు, పరికరాలు మరియు వైద్య సామాగ్రి రోగుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇలాంటివి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చని పేర్కొంది. వైద్య ఉత్పత్తుల భద్రతను పర్యవేక్షించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









