వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్..
- June 18, 2026
వాట్సాప్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మీ ప్రైవసీకి మరింత సేఫ్టీ.. ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు పంపే మెసేజ్ ఒకసారి చూడగానే వెంటనే మాయమైపోతుంది. యూజర్లను ఆకట్టుకునేందుకు యాప్‌కు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తోంది.
ఇప్పుడు, ఫోటోలు, వీడియోల కోసం ‘View Once’ ఫీచర్‌ను ప్రవేశపెట్టగా మెసేజ్‌ల కోసం కూడా కంపెనీ ‘View Once’ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్‌తో, మెసేజ్‌లను (WhatsApp iPhones) ఒకసారి చూశాక అవి వాటంతట అవే అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉంది. అతి త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది.
వాట్సాప్ నివేదిక ప్రకారం..
ఆండ్రాయిడ్ ఐఓఎస్ బీటా వెర్షన్‌లలో ఈ ఫీచర్ వివరాలు రివీల్ అయ్యాయి. అయితే, ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ అందుబాటులోకి రాలేదు. సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయకుండా యూజర్లకు మరింత కంట్రోలింగ్ ఇవ్వాలని వాట్సాప్ ఈ ఫీచర్ తీసుకువస్తోంది.
ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
నివేదికల ప్రకారం.. వాట్సాప్ యూజర్లు మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్‌ను ఎక్కువసేపు ట్యాప్ చేసి పట్టుకుంటే చాలు.. ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వారికి ‘Send As View Once’అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీ మెసేజ్ పంపే వ్యక్తికి ఒక్కసారి మాత్రమే చదివే ఫార్మాట్‌లో పంపవచ్చు. అవతల వ్యక్తి మీ మెసేజ్ ఒకసారి చూశాక అదృశ్యమవుతుంది. ఆ తర్వాత మళ్లీ చూడలేరు.
ఫోటోలు, వీడియోల కోసం ‘వ్యూ వన్స్’ ఫీచర్ మాదిరిగానే మెసేజ్ చూసిన వెంటనే కాపీ చేయడం, ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం చేయలేరు. మెసేజ్ సేవ్ కూడా చేయలేకపోవచ్చు. స్క్రీన్‌షాట్‌లు, స్క్రీన్ రికార్డింగ్‌లపై కూడా లిమిట్స్ ఉండొచ్చు.
ఈ ఫీచర్ పర్సనల్ గ్రూప్ చాట్‌లు రెండింటిలోనూ వర్క్ అవుతుంది. అయితే, ఛానెల్‌లలో అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్‌కు సంబంధించిన ఏ వివరాలనూ కంపెనీ ఇంకా వెరిఫై చేయలేదు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









