షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- June 18, 2026
తక్షణమే పనులు ప్రారంభించాలని షార్జా రూలర్ ఆదేశం
షార్జా: షార్జాలోని యూనివర్సిటీ హాస్పిటల్ సేవలను మరింత విస్తరించేందుకు AED 300 మిలియన్ల వ్యయంతో భారీ విస్తరణ ప్రాజెక్టును తక్షణమే అమలు చేయాలని షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు.
ప్రస్తుత ఆసుపత్రి భవనానికి ఆనుకుని కొత్త భవనాన్ని నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా ఆసుపత్రి సామర్థ్యం రెండింతలు కానుంది. అంతేకాకుండా రోగులు, సందర్శకుల సౌకర్యార్థం అదనంగా 300 పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ విషయాన్ని షార్జా హెల్త్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్ అజీజ్ అల్ ముహైరీ వెల్లడించారు. షార్జా రేడియో, టెలివిజన్‌లో ప్రసారమయ్యే “డైరెక్ట్ లైన్” కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
ఆసుపత్రి ఆరోగ్య సేవలను ఆధునికీకరించేందుకు, పెరుగుతున్న వైద్య అవసరాలను తీర్చేందుకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఈ విస్తరణ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు, అధునాతన చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
షార్జా ప్రభుత్వం ఆరోగ్య రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిరంతరం పెట్టుబడులు పెడుతోందని ఆయన తెలిపారు.
ఈ విస్తరణ పూర్తయిన తర్వాత యూనివర్సిటీ హాస్పిటల్ షార్జా ఎమిరేట్‌లోని ప్రముఖ వైద్య కేంద్రంగా మరింత బలోపేతం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







