గాల్లో కాల్పులపై కఠిన చర్యలు

- August 10, 2016 , by Maagulf
గాల్లో కాల్పులపై కఠిన చర్యలు

సౌదీ వెస్టర్న్‌ రీజియన్‌ ఆఫ్‌ మక్కా పోలీసులు, సెలబ్రేషన్ల పేరుతో ఎవరైనా గాల్లోకి తుపాకీల్ని పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము అలాగే కింగ్‌డమ్‌కి చెందిన సెక్యూరిటీ ఏజెన్సీస్‌ ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. పెళ్ళిళ్ళ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరిపినా అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. హ్యాపీ అకేషన్స్‌లో ఇలాంటి కార్యక్రమాలు ఇకపై జరగకుండా ఉండేందుకుగాను కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వెడి&ంగ్‌ హాల్స్‌, రిలాక్సేషన్‌ ఏరియాస్‌లలో ప్రత్యేక నిఘా పెట్టారు. అన్ని చోట్లా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా నిర్వాహకులకు పోలీసులు ఇప్పటికే తాఖీదులు పంపారు. గత మార్చ్‌లో సౌదీ అథారిటీస్‌ ఇద్దరు గ్రూమ్స్‌ని వారి వెడ్డింగ్‌ నైట్‌ సందర్భంగా గాల్లో కాల్పులు జరిపినందుకు అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com