సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- July 22, 2026
మనామా: సోషల్ మీడియాలో ప్రజా నైతిక విలువలకు విరుద్ధంగా భావించిన కంటెంట్‌ను ప్రచురించినందుకు 31 ఏళ్ల అరబ్ జాతీయుడిని బహ్రెయిన్ అధికారులు అరెస్టు చేశారు. అవినీతి నిరోధక, ఆర్థిక మరియు ఎలక్ట్రానిక్ భద్రత ప్రధాన డైరెక్టరేట్ (General Directorate of Anti-Corruption, Economic and Electronic Security) ఈ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని, అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించనున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియాను వినియోగించే సమయంలో చట్టాలు, నిబంధనలను పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు. చట్టాలను ఉల్లంఘించే లేదా బహ్రెయిన్ సమాజ ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులు లేదా కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడం మానుకోవాలని హెచ్చరించారు. సామాజిక శాంతి, ప్రజా విలువలను కాపాడేందుకు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







