ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- July 22, 2026
మస్కట్: వికలాంగుల హక్కులపై అవగాహన పెంపొందించి, వారికి మరింత సమగ్ర వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఒమాన్ సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' (Purple Saturday) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. "ఏ డే విత్ లాస్టింగ్ ఇంపాక్ట్" అనే నినాదంతో ఈ కార్యక్రమం తొలి ఎడిషన్ నిర్వహించబడుతోంది. ప్రతి సంవత్సరం జూలై చివరి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమం గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల ఉమ్మడి కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వికలాంగుల హక్కులపై ప్రజల్లో అవగాహన పెంచడం, వారికి సమాజంలో మరింత భాగస్వామ్యం కల్పించడం, అలాగే వాణిజ్య, సేవా, పర్యాటక రంగ సంస్థలు వారికి అనుకూలమైన సేవలు అందించేలా ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమం తొలిసారిగా 2021లో ప్రారంభమైంది. వికలాంగులకు సమాన అవకాశాలు కల్పించడం, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం, న్యాయం, సమానత్వ సూత్రాలను బలోపేతం చేయాలనే జీసీసీ దేశాల ఉమ్మడి సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది.ఒమాన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమగ్ర సమాజ నిర్మాణంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.
సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని కమ్యూనికేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ విభాగం తాత్కాలిక డైరెక్టర్ జనరల్ అద్నాన్ ముస్తఫా అల్ ఫార్సీ మాట్లాడుతూ.. వికలాంగులకు అనుకూలమైన సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం, సమాజంలో సమగ్రత భావాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి వికలాంగుల సాధికారత కోసం పనిచేసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్నారు. అలాగే వారికి అందించే సేవల పరిధిని విస్తరించి, ఆర్థిక, సామాజిక రంగాల్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కల్పించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్‌లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







