కృష్ణా పుష్కరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
- August 10, 2016
శ్రావణశుద్ద నవమి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కృష్ణవేణి పుష్కరాల పూర్తిస్థాయి ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన అధికార నివాసంలో సమీక్షించారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లలగుండా ప్రవహిస్తున్న కృష్ణానది ఇటీవల వర్షాలకు పరవళ్లు తొక్కుతున్న నేపథ్యంలో పవిత్ర పుష్కరస్నానాలకు భక్తులు కోట్లాదిగా తరలిరానున్నారు. వరుస సెలవలు కారణంగా భక్తుల రద్దీ మరింత పెరగనున్నది. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు సీఎంకు వివరించారు. బుధవారం నాటి సమీక్షా సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అటవీ, బిసీ సంక్షేమ సఖ మంత్రి జోగు రామన్న, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, సంబీపూర్ రాజు, సిఎంఓ అధికారి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల సమయంలో భక్తులు కృష్ణానదిలో పూజలు, స్నానాలు, దాన ధర్మాలు, పితృ దేవతలకు పిండ ప్రధానాలు చేస్తే పుణ్యం కలుగుతుందని పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలనుండి కూడా భక్తులు తరలిరానున్నారు. ఆగష్టు 12న ప్రారంభమై పదకొండురోజుల పాటు కొనసాగి ఆగష్టు 23న కృష్ణా పుష్కరాల ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏర్పాట్లకు సంభందించి వివరాలు సేకరించడంతో పాటు సంభందిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాజెక్టులు నిందుతున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడంలో జాప్యం చేయవద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో ప్రారంభమైన మొదటి స్నాన ఘాట్ నుంచి నల్గొండలోని ఆఖరి పుష్కర ఘాట్ వరకు నది పొడవునా పుష్కలమైన నీరు ఇప్పటికే ప్రవహిస్తుండడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకోసం మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 81 పుష్కర స్నాన ఘాట్ల నిర్మాణం పనుల పై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







