ఢాకాలో మాజీ ఎంపీకి ఉరిశిక్ష ఖరారు
- August 10, 2016
స్వాతంత్య్రోద్యమ కాలంలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు గాను జమాతే ఇస్లామీ పార్టీ నేత, మాజీ ఎంపీ షెకావత్ హుస్సేన్(68)కు బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రెబ్యునుల్ బుధవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. షెకావత్ హుస్సేన్ యుద్ధ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయన్ను దోషిగా తేల్చింది. షెకావత్ తో పాటు కేసుతో సంబంధమున్న మరికొందరు నిందితులకు జీవిత ఖైదు విధించింది ట్రైబ్యునల్.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌లోనే అతిపెద్ద ముస్లిం పార్టీగా జమాతే ఇస్లామీ గుర్తింపు ఉంది. కాగా, 1971లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో జమాతే ఇస్లామీ నేతలు బంగ్లాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు సహకరించారనే అభియోగాలున్నాయి.
ఈ వ్యవహారంలో షెకావత్ కూడా కీలక పాత్ర పోషించారని రుజువు కావడంతో.. ఆయనకు ఉరిశిక్ష తప్పలేదు. అయితే ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు షెకావత్ తరపు న్యాయవాది ప్రకటించారు. ఇవే అభియోగాలపై ఈమధ్య కాలంలో బంగ్లాదేశ్ పలువురిని ఉరి తీసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







