సినిమా రివ్యూ: ‘మా ఇంటి బంగారం’.!
- June 19, 2026
‘ఓ బేబీ’ సూపర్ హిట్ కాంబినేషన్ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన సినిమా ‘మా ఇంటి బంగారం’ కావడంతో ఈ సినిమా పై ఆటెమెటిగ్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అలాగే, సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంది. సమంత నటిస్తూ, నిర్మించిన సినిమా ఇది. భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించడం కూడా ఈ సినిమాకి మరో ఆకర్షణ. ఇన్ని ఆకర్షణల మధ్య తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందిో తెలియాలంటే, సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
చిన్నప్పుడే తల్లితండ్రుల్ని కోల్పోయిన స్వర్ణ (సమంత). తనకంటూ ఓ పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే పెద్ద కుటుంబానికి చెందిన డాక్టర్ అనిరుధ్( దిగంత్)ని ప్రేమించి పెళ్లాడుతుంది. కానీ, ఇంట్లో తెలియకుండా స్వర్ణని పెళ్లాడినందుకు అనిరుధ్ కుటుంబం అతన్ని దూరం పెడుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య కుటుంబానికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది అనిరుధ్‌కి. దాంతో, తన మంచితనంతో.. ఇంట్లో వాళ్ల మనసుల్ని గెలుచుకుని బంగారం అనిపించుకోవాలనుకుంటుంది స్వర్ణ. ఊరు.. ఊరు పద్దతులు, కుటుంబ కట్టుబాట్లు, సాంప్రదాయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆ కుటుంబంలో స్వర్ణ ఎలా మేనేజ్ కాగలిగింది.? ఇదే పెద్ద టాస్క్ అనుకుంటే, మరోవైపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కరుణ (గుల్షన్ దేవయ్య)కీ, స్వర్ణకీ సంబంధం ఏంటీ.? స్వర్ణ కుటుంబాన్ని గుల్షన్ ఎందుకు ఇబ్బంది పెట్టాడు.? అసలు స్వర్ణ ఎవరు.? ఆమె గతం ఏంటీ.? తన గతం తన కుటుంబానికి తెలియకూడదని.పద్ధతిగా వంటింట్లో . గరిటె తిప్పే చేతితో గన్ పట్టాల్సిన పరిస్థితి స్వర్ణకు ఎందుకు వచ్చింది.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘మా ఇంటి బంగారం’ సినిమా ధియేటర్లలోనే చూడాలి.
నటీ నటుల పనితీరు:
గ్లామర్ తారగా సమంత పర్ఫామెన్స్ ఏంటో తెలుసు. అలాగే, ‘యశోద’ తదితర సినిమాలతో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతోనూ ఆమెలోని నెక్స్ట్ లెవల్ టాలెంట్ కూడా అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో స్వర్ణగా ఓ పద్ధతైన ఇల్లాలిగానూ, ఝాన్సీగా గతంలో గన్ను పట్టి చేసిన హంగామాతో.. ఆమెలోని డిఫరెంట్ వేరియేషన్స్ ఈ సినిమాలో చూస్తాం. క్యారెక్టర్లో ఎన్ని వేరియేషన్స్ వచ్చినప్పటికీ తనదైన టాలెంట్‌తో సమంత బంగారమే అనిపించుకుంటుంది. ఆ విషయంలో సమంత టాలెంట్‌కి ఎలాంటి వంకలూ పెట్టడానికి లేదు. సపోర్టింగ్ రోల్ పోషించిన భర్త దిగంత్ పాత్రకు పెద్దగా యాక్టింగ్ స్కోపు లేదు. కానీ, వున్నంతలో ఓకే అనిపించుకున్నాడు. విలన్ రోల్ పోషించిన గుల్షన్ దేవయ్యను ఆల్రెడీ చాలా వెబ్ సిరీసుల్లో చూశాం. మంచి టాలెంట్ వున్న నటుడు. కానీ, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో అంతగా ఫోకస్ పెట్టినట్లు అనిపించదు. విలన్ రోల్ ఎంత పవర్ ఫుల్ వుంటే మెయిన్ లీడ్ పవర్ అంత బావుంటుంది. అదే ఈ సినిమాలో మైనస్ అయ్యిందనొచ్చు. వెండితెరపై యాంకర్‌గా తనదైన టాలెంట్ చూపించిన శ్రీముఖికి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ దక్కింది. అలాగే, మరో యాంకర్ మంజూష నటనకీ మంచి స్కోొప్ దక్కింది. అమాయకత్వంతో కూడిన హాస్యాన్ని పంచింది. సీనియర్ నటీమణులు శ్రీలక్ష్మి, గౌతమి తదితరులు తమకు అనుభవం వున్న పాత్రల్లో నటించి మెప్పించారు. చివరిలో గెస్ట్‌గా మెరిసిన వెన్నెల కిషోర్ తనదైన నవ్వులు పూయించారు. మిగిలిన నటీ నటులు తమ తమ పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
రాజ్ నిడిమోరు అందించిన కథ బాగుంది. కానీ, తెరకెక్కించిన విధానంలో కొన్ని లోపాలున్నాయ్. ప్రధమార్ధాన్ని చక్కగా కుటుంబ కథా పాత్రలతో హాయిగా స్టార్ట్ చేశారు. అంతే హాయిగా తీసుకెళ్లారు. కానీ, ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథ, కథనం రెండూ వీక్ అయిపోయాయ్. కథ కామెడీ నుంచి యాక్షన్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఓకే. అయినా సరే, స్వర్ణ క్యారెక్టర్‌లోని గతానికి సంబంధించిన ట్విస్ట్ ఏమంత ఎమోషన్ క్రియేట్ చేసేలా వుండదు. తన గతాన్ని కుటుంబానికి తెలియకుండా మ్యానేజ్ చేయాలని చేసే ప్రయత్నం.. తదనుగుణంగా జరిగే మార్పులు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ఫస్టాఫ్ జోష్ని యాక్షన్‌తో కలిపి సెకండాఫ్‌లో మ్యానేజ్ చేయడంలో దర్శకురాలు కాస్త తడబాటుకు గురయినట్లు అనిపిస్తుంది. మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణ్ వర్క్ బాగుంది. పెళ్లి పాటతో పాటూ, కొన్ని పాటలు.. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైలాగ్స్ ఫస్ట్ఫ్ వరకూ బాగున్నాయ్. సెకండాఫ్‌లో సో సోగా నడుస్తాయ్. నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది.
ప్లస్ పాయింట్స్:
సమంత పర్ఫామెన్స్, ఫస్టాఫ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు..
మైనస్ పాయింట్స్:
వీక్ సెకండాఫ్..
చివరిగా:
‘మా ఇంటి బంగారం’.. ఈ బంగారం సగమే మెరిసింది.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







