సెప్టెంబర్ 2నుంచి ప్రారంభంకానున్నహజ్‌యాత్ర

- July 25, 2015 , by Maagulf
సెప్టెంబర్ 2నుంచి ప్రారంభంకానున్నహజ్‌యాత్ర

 ప్రవిత హజ్‌యాత్ర-2015 సెప్టెంబర్ 2 తేదీ నుంచి మొదలుకానుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఏ. షూకుర్ తెలిపారు. శనివారం 2015 హజ్ షెడ్యూల్ వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ ఏడాది హజ్ కమిటీ ఇరురాష్ర్టాల నుంచి ఎంపికైన హజ్ యాత్రికులు 16 ఇండియన్ ఎయిర్‌లైన్ విమానాల ద్వారా వెళ్తారన్నారు. సెప్టెంబర్ 16వ తేదీ వరకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే యాత్రికులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా సోమవారం నుంచి నాలుగురోజుల పాటు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హజ్‌కు వెళ్లే ప్రతీ యాత్రికుడు టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కవర్ నెంబర్ క్రమసంఖ్య ఆధారంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి హజ్ యాత్రకు ఎంపికైన వారికి మాత్రమే టీకాలు ఇస్తామన్నారు. రోజు 500 మంది చొప్పున మూడు రోజులు 1500 మందికి టీకాలు ఇస్తామన్నారు. ఆగస్టు నెలలోని మొదటి వారంలో హజ్ యాత్రికులకు సూట్‌కేసులు అందజేస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నెలలోనే టెండర్ల్ కమిటీ ద్వారా టెండర్‌ల ప్రక్రియ, ప్రభుత్వ శాఖ సమన్వయ సమావేశం, హజ్ టర్మిన్ల సందర్శన ఉంటుందన్నారు. ఈ ఏడాది హజ్ క్యాంప్ ఆగస్టు 30వ తేదీ లోపు ప్రారంభిస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com