దెబ్బకు దెబ్బ
- July 25, 2015
ఒక అడవిలో నక్క, కొంగ స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క, కొంగను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. మంచిగా పాయసం చేసి ఒక పెద్ద కంచంలో పోసి కొంగ ముందు పెట్టింది. పాపం తన పొడుగాటి ముక్కుతో కొంగ ఆ పాయాసాన్ని తాగలేక దిక్కులు చూడసాగింది. ఇంతలో నక్క అదేంటి కొంగన్నా పాయసం తాగడంలేదే. నేను చేసిన పాయసం రుచిగా లేదా? ఇటివ్వు నేను రుచి చూస్తాను అంటూ కంచం తన దగ్గరకు తీసుకుని మొత్తం పాయసం తన నాలుకతో నాకేసి..నన్ను క్షమించు కొంగన్నా నా ఇంట్లో ఇంతే పాయసం ఉంది అంది. కొంగ ఫర్వాలేదులే నక్క చెల్లీ. రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి వెళ్లిపోయింది. మర్నాడు ఉదయం ఎంతో ఆశగా నక్క, కొంగ దగ్గరికి బయలుదేరింది. కొంగ మంచిగా సూప్ తయారు చేసి ఒక పొడవాటి జాడీలో వేసి నక్క ముందు పెట్టింది. బాగా ఆకలితో ఉన్న నక్క ఆ జాడీలో మూతి పెట్టి దానిలోని సూప్ మొత్తం తాగేయాలని శతవిధాల ప్రయత్నం చేసింది. కానీ ఆ జాడీలో దాని మూతి దూరితేనే కదా. ఇంతలో కొంగ వచ్చి నక్క చెల్లీ ఇంకా తాగలేదే? నేను చేసిన సూప్ నీకు నచ్చలేదా? అంటూ తన పొడుగాటి ముక్కుతో ఆ సూప్‌ని చకచకా తాగేసి, నన్ను క్షమించు నక్క చెల్లీ నా ఇంట్లో ఇంతే సూప్ ఉంది అంది. దానితో తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది నక్కకి. సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్లిపోయింది. కొంగ నక్కకి భలే బుద్ధి చెప్పింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







