బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- June 22, 2026
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ, ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేయబోతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్ త్వరలోనే తప్పుకోనున్నారని, ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని వైఫల్యాలను ట్రంప్ (Donald Trump)తీవ్రంగా విమర్శించారు. కీర్ స్టార్మర్ దేశానికి సంబంధించిన రెండు అత్యంత ముఖ్యమైన అంశాలలో దారుణంగా విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు. అందులో మొదటిది ‘వలసల నియంత్రణ’ కాగా, రెండోది ‘ఇంధన విధానం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నార్త్ సీ ఆయిల్ (ఉత్తర సముద్ర చమురు ఉత్పత్తి) రంగాన్ని తెరవడంలో స్టార్మర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో అంతర్గత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లేబర్ పార్టీలోనే స్టార్మర్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, ఆయనపై రాజీనామా చేయాలంటూ సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతోందని నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకముందే.. ట్రంప్ ముందస్తుగా ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం విశేషం.
తాజా వార్తలు
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు







