యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- June 22, 2026
ప్రతిమ మెడికల్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
కరీంనగర్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆదివారం యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వైద్యులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాధాన్యతను తెలుసుకున్నారు.
యోగా గురువులు నాగమల్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. వారు తాడాసనం, వజ్రాసనం, ప్రాణాయామం తదితర వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు.
ఈ సందర్భంగా యోగా గురువులు మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ ఇజ్రాయెల్, సీఏఓ రామ్‌చందర్ రావు, డాక్టర్లు ప్రణయ్, శ్రీకాంత్‌తో పాటు కళాశాల విద్యార్థులు, పీజీ వైద్యులు, మెడికల్ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా క్రమశిక్షణ, సానుకూల ఆలోచన విధానం కూడా పెంపొందుతుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సంకల్పించారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







