ఎఫ్‌సీఐ ఉద్యోగులకు వృద్ధాప్యంలో కల్పించే ప్రయోజనాలు
- August 10, 2016
సుమారు 35 వేల మంది భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) ఉద్యోగులకు కొత్త పింఛను పథకానికి, ఉద్యోగ విరమణ అనంతర వైద్య సేవలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఉద్యోగులకు వృద్ధాప్యంలో కల్పించే ప్రయోజనాల్లో భాగంగా ప్రవేశపెట్టిన వీటికి ఏటా రూ.134.4 కోట్లు ఖర్చు కానుందని కేంద్ర ఆహారమంత్రి రామ్ విలాస్ పాసవాన్ తెలిపారు. 2008, డిసెంబరు 1 నుంచి పింఛను పథకం, ఉద్యోగ విరమణ పొందినవారికి 2006, ఏప్రిల్ 1 నుంచి వైద్య సేవలు వర్తిస్తాయని వర్తిస్తుందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది.
బొగ్గు విద్యుత్ కేంద్రాల కోసం పరిజ్ఞానాభివృద్ధి ప్రాజెక్టుకు సమ్మతి బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రాలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి కోసం రూ.1,555 కోట్ల పరిశోధన ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ (ఏయూఎస్‌సీ) పరిజ్ఞాన అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ఇంధన భద్రతకు తోడ్పడగలదని భావిస్తున్నారు. బొగ్గు వినియోగం, బొగ్గుపులుసు వాయువు ఉద్గారాన్ని తగ్గించే ఏయూఎస్‌సీ పరిజ్ఞాన రూపకల్పన కోసం పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టాలని బీహెచ్ఈఎల్, ఐజీసీఏఆర్, ఎన్టీపీసీ ప్రతిపాదించాయి. ఇది భారత పరిశ్రమలు అధిక బొగ్గు వినియోగ సామర్థ్యంతో కూడిన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పటానికి వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







