షర్మిలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు...
- August 10, 2016
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల 16 ఏళ్ల నిరశన దీక్షకు ముగింపు పలకడాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో షర్మిలకు ముప్పువాటిల్లే అవకాశం ఉండటంతో చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి కావాలనే తన నిర్ణయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని షర్మిల బుధవారమిక్కడ వాపోయారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను రద్దు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని పునరుద్ఘాటించారు. మరోవైపు చాలా ఏళ్ల నుంచి ఆహారం తీసుకోలేదు కనుక ప్రస్తుతానికి షర్మిలకు ద్రవపదార్థాలను మాత్రమే ఇస్తున్నట్లు జెనిమ్స్ వైద్యులు తెలిపారు. ఘన పదార్థాలు తీసుకొని.. పూర్తిస్థాయిలో ఆరోగ్యం మెరుగుపడే వరకు ఆసుపత్రిలోనే ఉంటారని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







