జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు ..
- August 10, 2016
విపక్ష నేత జగన్ రిషికేష్ యాత్రపై అప్పుడే వింత వింత వార్తలు పరుగుపెట్టేస్తున్నాయి. శారదా స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొన్న జగన్.. ఏపీకి మంచి జరగాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కోరుకున్నట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటుంటే.. సోషల్ మీడియా నుంచి మాత్రం.. సైడ్ ఎఫెక్ట్స్ తప్పలేదు. జగన్ తో పాటు ఎమ్.పిలు అవినాశ్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి కూడా పాల్గొన్న ఈ పూజల వెనుక వేరే కథ ఉందంటూ సెటైర్లు పడిపోతున్నాయి.
కృష్ణా పుష్కరాల పేరుతో ఇటు చంద్రబాబు హిందువుల మనోభావాలను కొల్లగొడుతుంటే.. జగన్ కు కన్నుకుట్టిందని.. అందుకే రిషీకేశ్ వెళ్లి పూజలు పునస్కారాలంటూ హడావిడి చేసుకున్నారని కొన్ని వెబ్ సైట్స్ లో రాతలు కనిపించాయి. ఇటు.. చంద్రబాబుతో బీజేపీ బంధం తెగిపోయే వాతావరణం కనిపిస్తుండడంతో.. ఈవిధంగా హిందుత్వ వాసనలు గుప్పించి కమలం పార్టీకి దగ్గరవ్వొచ్చని జగన్ భావిస్తున్నట్లు ఇంకోవైపు నుంచి రాజకీయ విశ్లేషణలు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాదు.. అక్రమాస్తుల కేసుల ఉచ్చు నుంచి తనను విడదియ్యమనే దేవుణ్ణి వేడుకున్నారని ఇటు తెలుగు తమ్ముళ్ల విసుర్లు. మొత్తంమీద కొత్త గెటప్ లో కనిపించిన యువనేత ఒకరకంగా సంచలనమే క్రియేట్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







