కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ..
- August 10, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని తాజాగా వచ్చిన 'కబాలి' చాటిచెప్పింది. ఫలితంతో ఏ మాత్రం సంబంధం లేకుండా రజనీ ఎలా కలెక్షన్ల వర్షం కురిపిస్తారోనన్న విషయం కూడా స్పష్టమైంది. 'కబాలి' అనంతరం శంకర్ దర్శకత్వంలో ఆయన '2.ఓ'లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తర్వాత తన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య తన తండ్రికి సంబంధించి ఓ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా సినిమా తీయాలని యోచిస్తున్నారు. మెగాప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరులో సినిమా ఆరంభమయ్యే అవకామున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్' అనే మోషన్ క్యాప్చర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







