మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- June 22, 2026
మాదకద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాష్ట్రవ్యాప్త అవగాహన కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్: జూన్ 26న జరగనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని, EAGLE తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాన్ని డీజీపీ సి.వి.ఆనంద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మరోసారి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో భాగంగా పిల్లలు, యువతతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజంపై చూపే తీవ్ర ప్రతికూల ప్రభావాలను వివరించారు. అలాగే మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి కారణమవుతున్న డిమాండ్–సరఫరా వ్యవస్థ, వాటి నియంత్రణ కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు.
పిల్లలు, యువతను మాదకద్రవ్యాల బారిన పడేలా ప్రలోభపెట్టే వారు దేశ భవిష్యత్తును దెబ్బతీసే ద్రోహులేనని హెచ్చరించారు. ఏ కుటుంబమూ తమ పిల్లలకు ఈ ప్రమాదం తలెత్తదని నిర్లక్ష్యంగా భావించకూడదని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ, పోలీస్ విభాగంలోని ప్రతి అధికారి, సిబ్బంది ఈ పోరాటాన్ని వ్యక్తిగత బాధ్యతగా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు కలిసి పనిచేస్తేనే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థల్లో త్వరలోనే యాంటీ-డ్రగ్ మరియు సేఫ్టీ క్లబ్‌లను తప్పనిసరి చేయనున్నట్లు వెల్లడించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి, మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం ద్వారా యువతలో చైతన్యం పెంపొందించి, మాదకద్రవ్యాల వ్యసనానికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన కార్ల డీలర్‌కు భారీ జరిమానా.. లైసెన్స్ సస్పెన్షన్..!!
- రసాయన పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలపై సీడీఏఏ భద్రతా సూచనలు..!!
- ‘రిపోర్ట్ మీ’ ఫిర్యాదుల వివరాలు గోప్యమే.. పీఏఎం హామీ..!!
- ఘనంగా హాంగ్‌కాంగ్‌లో 27వ కార్గిల్ విజయ్ దివస్
- ఉదయం 7 గంటలకు ముందు.. రాత్రి 8 తర్వాత డ్రిల్లింగ్కు నో..!!
- ఖతార్‌లో విదేశీ పెట్టుబడులు భారీగా పెరుగుదల..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య ‘వన్ స్టాప్’ ఎయిర్ ట్రావెల్ సిస్టమ్..
- జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పోలీసింగ్ పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈలో ఎండల తీవ్రత నుంచి కార్మికులకు రక్షణ..
- తెలంగాణ-ఏపీలో సీ ప్లేన్ సర్వీసులు..







