ఉదయం 7 గంటలకు ముందు.. రాత్రి 8 తర్వాత డ్రిల్లింగ్‌కు నో..!!
- August 10, 2026
మనామా: నివాస ప్రాంతాల్లో రహదారి తవ్వకాలు, నిర్మాణ పనులు, నిర్వహణ పనుల సమయాలపై బహ్రెయిన్‌లో కొత్త ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఉదయం 7 గంటలకు ముందు, రాత్రి 8 గంటల తర్వాత శబ్దంతో కూడిన నిర్మాణ పనులను నిషేధించాలని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. ఎంపీ బదర్ సాలెహ్ అల్ తమీమీ నేతృత్వంలో ఈ ప్రతిపాదనను రూపొందించారు. ఎంపీలు అబ్దుల్లా అల్ దాహెన్, అలీ అల్ నుఐమీ, అలీ సక్ర్ అల్ దోసరి, హిషామ్ అల్ అవాధీ దీనికి మద్దతు తెలిపారు.
ప్రతిపాదన ప్రకారం.. సాధారణ పనిదినాల్లో ఉదయం 7 గంటలకు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఉదయం 8 గంటలకు పనులు ప్రారంభించవచ్చు. అన్ని సాధారణ నిర్మాణ, నిర్వహణ పనులను రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏ పనులకు వర్తింపు?
రోడ్ల తవ్వకాలు, మురుగునీటి వ్యవస్థ పనులు, నీటి సరఫరా, విద్యుత్ నెట్‌వర్క్ పనులు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఈ నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. అయితే నీరు లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టే మరమ్మతులకు ఈ పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
ఫిర్యాదుల నేపథ్యంలో..
నివాస ప్రాంతాల్లో విశ్రాంతి సమయాల్లో నిర్మాణ పనుల వల్ల శబ్ద కాలుష్యంపై ప్రజల నుంచి పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయని అల్ తమీమీ తెలిపారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా ఈ నిబంధనలు దోహదపడతాయని చెప్పారు. అదే సమయంలో వేసవి కాలంలో కార్మికుల భద్రతను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.
కాగా, అత్యవసర మరియు ప్రజలకు అవసరమైన పనులను ఈ ప్రతిపాదన అడ్డుకోదని, సాధారణ నిర్మాణ పనులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలగని సమయాల్లో నిర్వహించడమే లక్ష్యమని ఎంపీలు పేర్కొన్నారు. ఇప్పటికే అమల్లో ఉన్న వేసవి మధ్యాహ్న సమయంలో పనులపై నిషేధం కూడా కొనసాగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







