బహ్రెయిన్–యూఏఈ మధ్య ‘వన్ స్టాప్’ ఎయిర్ ట్రావెల్ సిస్టమ్..
- August 10, 2026
మనామా/అబుదాబి: బహ్రెయిన్, యూఏఈ మధ్య విమాన ప్రయాణాన్ని మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త ‘వన్ స్టాప్’ ఎయిర్ ట్రావెల్ సిస్టమ్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణికులు విమాన ప్రయాణానికి సంబంధించిన పలు ప్రక్రియలను ఒకే చోట పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పదేపదే తనిఖీలకు హాజరు కావాల్సిన అవసరం తగ్గడంతో పాటు విమానాశ్రయాల్లో వేచి ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గనుంది.
గల్ఫ్ ఎయిర్, ఎతిహాద్ ప్రయాణికులకు తొలిదశలో అవకాశం
ఈ కార్యక్రమాన్ని తొలిదశలో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య ప్రయాణించే పౌరులకు అమలు చేయనున్నారు.
గల్ఫ్ ఎయిర్, ఎతిహాద్ ఎయిర్వేస్ విమానాల్లో ప్రయాణించే వారికి ఈ కొత్త విధానం తొలిదశలో అందుబాటులోకి రానుంది.
‘వన్ స్టాప్’ విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్, భద్రతా తనిఖీలు వంటి ప్రక్రియల్లో సౌలభ్యం కలగడంతో పాటు విమానాశ్రయాల్లో రద్దీ, నిరీక్షణ సమయం తగ్గే అవకాశం ఉంది.
జీసీసీ దేశాల మధ్య సులభతర ప్రయాణానికి ముందడుగు
బహ్రెయిన్–యూఏఈ మధ్య చేపడుతున్న ఈ కార్యక్రమం విస్తృత గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రణాళికలో భాగంగా ఉంది. సభ్య దేశాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేసి, సరిహద్దు ప్రయాణ ప్రక్రియలను వేగవంతం చేయడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం.
ఈ విధానం విజయవంతమైతే భవిష్యత్‌లో ఇతర జీసీసీ దేశాల మధ్య కూడా ఇలాంటి సమగ్ర ప్రయాణ సౌకర్యాలను విస్తరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







