అబుదాబీలో అగ్ని ప్రమాదం: 3 షాపుల దగ్ధం
- August 10, 2016
మూడు షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. బనియాస్ డౌన్ టౌన్‌లోని బనియాస్ కో ఆపరేటివ్ బిల్డింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన గురించి తెలియగానే అబుదాబీ సివిల్ డిఫెన్స్, ప్రమాద స్థలికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసింది. అయితే అప్పటికే పూర్తిగా ఆ షాపులు దగ్ధమయ్యాయి. మిగతా షాపులకు మంటలు వ్యాపించకుండా చేయగలిగారు సివిల్ డిఫెన్స్ సిబ్బంది. షాప్‌ల యజమానులు, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వేసవి కారణంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, షార్ట్ సర్క్యూట్స్ వల్లనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి గనుక, వాటి విషయంలో ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







