APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- June 24, 2026
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) చివరి దశ మ్యాచ్‌లు నేటి నుంచి అమరావతి పరిధిలోని మంగళగిరిలో ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 30వ తేదీ వరకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ ముగింపు దశకు వేదిక కానుండటంతో స్టేడియంతో పాటు రాజధాని ప్రాంతంలో క్రికెట్ పండుగ వాతావరణం నెలకొంది.
నేడే తొలి పోరు..మధ్యాహ్నం, సాయంత్రం డబుల్ హెడర్స్
మంగళగిరి స్టేడియంలో ఈరోజు రెండు రసవత్తర పోరులు జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు తలపడనున్నాయి. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు జరగబోయే రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. టీ20 ఫార్మాట్లో సాగే ఈ లీగ్ మ్యాచ్‌లు అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించనున్నాయి.
మంగళగిరి వేదికగా జరుగుతున్న ఈ తొలి మ్యాచ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. ఆయన రాకతో ఈ టోర్నీకి మరింత గ్లామర్, క్రేజ్ తోడయ్యాయి. రామ్ చరణ్ టాస్ వేసి ఈ మ్యాచ్‌లను అధికారికంగా ప్రారంభించనుండటంతో అటు క్రికెట్ ప్రేమికులతో పాటు ఇటు మెగా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పటిష్టమైన భద్రత, అత్యాధునిక వసతులతో ఏసీఏ స్టేడియం ఈ టోర్నీ కోసం ముస్తాబైంది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







