ఈ నెల 27, 28 తేదీల్లో 'స్నాప్‌డీల్' వారి గొప్ప సేల్
- July 26, 2015
ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ ఈ నెల 27, 28 తేదీల్లో బిగ్ ఎలక్ట్రానిక్ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 70 శాతం దాకా డిస్కౌంటుతో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మనున్నట్లు స్నాప్ డీల్ వెల్లడించింది. ప్రత్యేక ఆఫర్‌లతో పాటు అన్ని రకాల బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన తగ్గింపు ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కంప్యూటర్‌లు తదితర అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల పైన ఆఫర్లు ఉంటాయని తెలిపింది.
డిజిటల్ ఎస్ఎల్ఆర్ కెమెరాల పైన పద్దెనిమిది వేల రూపాయల తగ్గింపు ఇవ్వనుంది. ముందుగా రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందజేయనుంది. ఎలక్ట్రానిక్ సేల్ ఆఫర్ ద్వారా అమ్మకాలు భారీస్థాయిలో పెరిగే అవకాశముందని స్నాప్ డీల్ వైస్ ప్రెసిడెంట్ (ఎలక్ట్రానిక్స్, హోం) టోనీ నవిన్ తెలిపారు. ఏడు లక్షలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కొనుగోలు చేసిన తదుపరి రోజే డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







