‘ధర్మన్’..ఫస్ట్ లుక్ విడుదల
- June 24, 2026
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు ‘తలైవా 173’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఈ టైటిల్ ప్రకటన సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆపరేషన్ థియేటర్‌లో రజనీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్‌తో నిల్చొని ఉండగా… ఆయన కాలు కింద ఒక రౌడీ పడి ఉన్నట్టుగా ఈ పోస్టర్‌ను అత్యంత వినూత్నంగా డిజైన్ చేశారు. దీంతో ఈ సినిమాలో రజనీకాంత్ ఒక పవర్‌ఫుల్ డాక్టర్‌గా కనిపించబోతున్నారనే వార్తలకు అధికారిక ముద్ర పడింది. ఈ టైటిల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ కమల్ హాసన్ తమిళంలో ‘ధర్మమే వెల్లుమ్!’ అని ట్వీట్ చేయడం విశేషం.
దర్శకుడి మార్పుల పై వీడిన సస్పెన్స్
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి దర్శకుడి విషయంలో పలు మార్పులు జరిగాయి. వాస్తవానికి ఈ చిత్రానికి మొదట దర్శకుడిగా సుందర్ సి పేరును ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే ‘ఓ మై కడవలే’, ‘డ్రాగన్’ చిత్రాల దర్శకుడు అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తారనే ప్రచారం గట్టిగా సాగింది. తాజాగా విడుదల చేసిన అఫీషియల్ పోస్టర్‌తో అశ్వత్ మరిముత్తునే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు స్పష్టమైంది.
కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇండస్ట్రీలోని బెస్ట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు పవర్‌ఫుల్ సంగీతాన్ని అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీతలైన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అనిబరివ్ ద్వయం స్టంట్స్ డిజైన్ చేస్తున్నారు. రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ ‘ధర్మన్’ చిత్రంపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో అకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







