కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- June 25, 2026
దుబాయ్: వేసవి కాలంలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ పోలీసులు ‘షేడ్ అండ్ రివార్డ్’ (Shade and Reward) పేరుతో ప్రత్యేక సామాజిక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుబాయ్ పోలీస్ పాజిటివ్ స్పిరిట్ కౌన్సిల్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్, అలాగే ‘థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్’ వాలంటీర్ బృందం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
వేసవి నెలల మొత్తం ప్రతి వారం కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమాజంలో ఐక్యత, సహనం, పరస్పర సహకారం, మానవతా విలువలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
పాజిటివ్ స్పిరిట్ కౌన్సిల్ చైర్‌పర్సన్ ఫాతిమా అహ్మద్ బుహజీర్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. “కార్మికులకు గొడుగులు, చల్లని పానీయాలు, భోజనం, అవసరమైన వస్తువులు అందించడంతో పాటు అవగాహన, మానవతా సందేశాలను కూడా అందిస్తున్నాం. ఇది సమాజంలోని ప్రతి వర్గం పట్ల ఉన్న శ్రద్ధను ప్రతిబింబిస్తుంది” అని ఆమె తెలిపారు.
“అభివృద్ధి, నిర్మాణ రంగాల్లో కార్మికులు కీలక భాగస్వాములు. వారి నిరంతర కృషికి కృతజ్ఞతలు తెలియజేయడం మన సామాజిక బాధ్యత” అని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజే 600 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. దుబాయ్ పోలీసుల ఈ మానవతా కార్యక్రమంపై వారు హర్షం వ్యక్తం చేశారు. తమతో నేరుగా మమేకమై, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని కార్మికులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి యూఏఈ ప్రభుత్వం, దుబాయ్ పోలీసులు ఇస్తున్న ప్రాధాన్యత మరోసారి ప్రతిఫలించిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







