FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- June 25, 2026
ఫుట్‌బాల్ ప్రపంచంలో ప్రపంచకప్‌ను గెలవడం ప్రతి ఆటగాడి జీవితకాల స్వప్నం. క్రీడాపరంగా ఈ ట్రోఫీకి ఉన్న గౌరవం అమూల్యం అయినప్పటికీ, దాని తయారీకి ఉపయోగించిన లోహం విలువ మాత్రం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీలోని పసిడి విలువ గత టోర్నమెంట్‌తో పోలిస్తే ఏకంగా రెండింతలకు పైగా పెరిగి సుమారు రూ. 6.7 కోట్లకు చేరింది.
ఆర్థిక విశ్లేషణల సంస్థ ‘LSEG’ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం ఈ ప్రపంచకప్ ట్రోఫీలో ఉన్న బంగారం విలువ సుమారు 7.13 లక్షల డాలర్లు (దాదాపు రూ.6.73 కోట్లు) గా ఉంది. అదే 2022లో ఖతార్ వేదికగా అర్జెంటీనా కప్‌ను ముద్దాడిన సమయంలో, ఇందులోని పసిడి విలువ కేవలం 2.77 లక్షల డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.
5 దశాబ్దాల్లో ఊహించని పెరుగుదల: 18 క్యారెట్ల బంగారంతో ప్రత్యేక తయారీ
ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని 1974లో తొలిసారిగా పరిచయం చేశారు. ఆ సమయంలో దానిలోని బంగారం విలువ కేవలం 25 వేల డాలర్లు మాత్రమే. అయితే గత ఐదు దశాబ్దాల్లో అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ఆర్థిక మార్పుల వల్ల పసిడి ధరలు భారీగా పెరగడంతో ట్రోఫీ విలువ కూడా ఊహించని స్థాయికి చేరింది. ఈ ట్రోఫీని 18 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. దీని మొత్తం బరువు 6.175 కిలోలు కాగా, అందులో 4.93 కిలోల మేర స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, ఆర్థిక మందగమనం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారం వైపు మళ్లడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రీడా ట్రోఫీ.. మిగతావన్నీ వెనకే!
ప్రపంచంలోని ఇతర ప్రధాన క్రీడల ట్రోఫీలతో పోలిస్తే ఫిఫా కప్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మెజారిటీ భాగం స్వచ్ఛమైన బంగారంతో తయారైన ఏకైక ప్రతిష్టాత్మక ట్రోఫీ ఇదే. ప్రసిద్ధ యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ వంటి ట్రోఫీలను వెండితో తయారు చేస్తారు. వీటి లోహ విలువలు వరుసగా కేవలం 16,950 డాలర్లు, 22,600 డాలర్లు మాత్రమే ఉంటాయి. అలాగే అమెరికాకు చెందిన ప్రసిద్ధ ‘బోర్గ్-వార్నర్’ ట్రోఫీని ఏకంగా 69 కిలోల భారీ వెండితో తయారు చేసినప్పటికీ.. దాని లోహ విలువ సుమారు 1.56 లక్షల డాలర్ల దగ్గరే ఆగిపోయింది. ఈ రకంగా చూస్తే లోహపు విలువ పరంగా ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీకి దరిదాపుల్లో కూడా ఏ ఇతర క్రీడా ట్రోఫీ నిలవలేకపోతోంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్‌లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్‌కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!
- భారత్-యూఏఈ ప్రయాణికులకు అలర్ట్..!!
- పౌరుల సంక్షేమమే కేంద్రంగా భారత దౌత్య విధానం
- రెడీ ఫర్ స్కూల్.. QNLలో ప్రత్యేక వర్క్‌షాపులు..!!







