ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్‌ మూసివేత..!!

- November 26, 2026 , by Maagulf
ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్‌ మూసివేత..!!

దోహా: ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఖతార్‌లోని ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్‌ను 15 రోజుల పాటు మూసివేయాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆదేశించింది.

ఫరీజ్ అబ్దుల్ అజీజ్ ప్రాంతంలోని స్ట్రీట్ 870, బిల్డింగ్ నంబర్ 29లో ఈ రెస్టారెంట్ ఉంది. 2026 నవంబర్ 19 నుంచి 15 రోజుల పాటు మూసివేత ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవ ఆహార నియంత్రణకు సంబంధించిన Law No. 8 of 1990 నిబంధనలను, తదనంతర సవరణలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.

అయితే, నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించారనే నిర్దిష్ట వివరాలను మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే ఆహార సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com