సౌదీలో 97 శాతానికి చేరిన ఆరోగ్య సేవల కవరేజీ..!!
- November 26, 2026
రియాద్: సౌదీ అరేబియాలో ఆరోగ్య సేవల విస్తరణ గణనీయంగా పెరిగింది. 2026లో దేశవ్యాప్తంగా 10.9 కోట్లకు పైగా వైద్య సేవలను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ మంత్రి డాక్టర్ మొహమ్మద్ అల్ అబ్దులాలి వెల్లడించారు. జనాభా క్లస్టర్లలో ఆరోగ్య సేవల కవరేజీ 97 శాతానికి చేరినట్లు తెలిపారు. రియాద్‌లో జరిగిన బడ్జెట్ 2027 ఫోరంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
2026లో ఆరోగ్య రంగంలో మొత్తం 116 ప్రాజెక్టులను చేపట్టినట్లు చెప్పారు. వీటిలో 15 కొత్త ప్రాజెక్టులు కాగా, 101కు పైగా ఆరోగ్య సేవల కేంద్రాలు, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. దేశంలో ప్రస్తుతం వారానికి 13,000 శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రులకు వచ్చిన రోగుల్లో 94.6 శాతం మందికి నాలుగు గంటల్లోనే చికిత్స అందించినట్లు అల్ అబ్దులాలి తెలిపారు.
సౌదీ విజన్ 2030లో భాగంగా అమలు చేస్తున్న హెల్త్ సెక్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు చికిత్స నాణ్యతను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్య సేవలు పొందిన వారి అనుభవ సూచీ (Beneficiary Experience Index) కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. 2017లో 66 శాతంగా ఉన్న ఈ సూచీ ప్రస్తుతం 89 శాతానికి పైగా చేరినట్లు వెల్లడించారు. స్వతంత్ర అంతర్జాతీయ కొలమానం ఆధారంగా ఈ ఫలితాలను నమోదు చేసినట్లు చెప్పారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ఆసుపత్రులను మరింత అభివృద్ధి చేయడం, వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడమే కాకుండా ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వడం తమ లక్ష్యమని అల్ అబ్దులాలి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!
- అరుణాచల్ సరిహద్దు పై భారత్-చైనా కీలక చర్చలు..10 రోజుల పాటు సమావేశాలు
- ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్ మూసివేత..!!
- సౌదీలో 97 శాతానికి చేరిన ఆరోగ్య సేవల కవరేజీ..!!
- ఒమన్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు..!!
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం
- రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..11 మంది భారతీయుల గుర్తింపు
- సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్







