తనపై అత్యాచారం చేయబోయిన స్నేహితుడిని హత్య చేశాడు
- August 11, 2016
కామంతో కళ్ళు మూసుకు పోయిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని కామించబోయాడు..అతని లైంగిక వేధింపులకు తాళ లేక నమ్మకంగా మట్టుపెట్టి దేశం విడిచి పారిపోదామనుకొన్నాడు...చివరకు పోలీసులకు దొరికిపోయాడు...దుబాయ్ పోలీసులు బుధవారం ఒక ఆసియా వ్యక్తి మరణం విషయంలో రహస్యం దొరికింది. అల్ క్కువుజ్ పారిశ్రామిక ప్రాంతంలో కత్తిపోట్లకు గురైన ఒక మృతదేహాన్ని ప్రధాన రహదారి పక్కనే కనుగొన్నారు. ఈ కేసు కు సంబంధించిన హంతకుడిని సైతం పట్టుకొన్నారు.
హత్యకు పాల్పడినట్లుగా ఆరోపించబడుతున్న వ్యక్తి దేశం నుండి తప్పించుకునే యత్నంలో పోలీసులకు దొరికిపోవడంతో అనుమానితుడు అరెస్టు చేశారు. నేర పరిశోధనల యొక్క జనరల్ డిపార్టుమెంటు (సిఐడి), సిఐడి అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ దుబాయ్ పోలీస్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మాంసూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ హంతకుడు యొక్క స్నేహితుడిని కారు లోపాలకి తీసుకువెళ్లి అనేక సార్లు కత్తితో అనేక పోట్లు పొడిచినట్లు తెలిపారు. ఈ కేసులో హంతకుడిని అరెస్టు చేసిన తర్వాత, తాను ఎందుకు హత్య చేయవల్సివచ్చిందో వివరించాడు అనుమానితుడు, తనని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని అనేక సార్లు అత్యాచారానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. మంగళవారం మళ్లీ అదేవిధంగా ప్రయత్నించాడని చెప్పారు. అతని వేధింపులకు తట్టుకోలేక ,అతనిని కత్తితో పొడిచి, మరణించిన వ్యక్తి కారులోనే ఆ ప్రాంతం నుంచి పారిపోయినట్లు, అల్ క్కువుజ్ పారిశ్రామిక ప్రాంతంలో రోడ్డు పక్కన తన స్నేహితుడి శవాన్ని కారులోంచి నెట్టివేసానని వెంటనే దేశం విడిచి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు దుబాయ్ పోలీసులు అతనిని యుఏఇ నుంచి బయటకు వెళ్ళకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. అబూధాబీ పోలీసులతో సమన్వయంతో హంతకుడిని అరెస్టు చేశారు.ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







