గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- June 27, 2026
మనామా: బహ్రెయిన్ మరియు అనేక ఇతర గల్ఫ్ దేశాలలో గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI నిషేధించబడిందని ఆన్లైన్లో ప్రచారంలో ఉంది. అయితే, దీనిపై ఇప్పటివరకు అధికారికంగా నిషేధం లేదని తెలుస్తోంది. కాగా, ప్లేస్టేషన్ ప్రీ-ఆర్డర్ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రీ-ఆర్డర్ బోనస్‌గా అందించే ఐచ్ఛిక చెల్లింపు సేవ అయిన GTA+కు ఉచిత సబ్స్క్రిప్షన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ మరియు ఖతార్ సహా అనేక మార్కెట్లలో అందుబాటులో లేదని ప్లేస్టేషన్ జారీ చేసిన ఒక నోటీసు ద్వారా ఈ గందరగోళం మొదలైంది. కొంతమంది వినియోగదారులు ఈ పరిమితిని, GTA 6 పైనే నిషేధం విధించారని పొరబడ్డారన్న వాదనలు ఉన్నాయి.
బహ్రెయిన్ గేమింగ్ నిపుణుడు అబ్దుల్లా అబ్దుల్రహ్మాన్ ప్రకారం, ఆ నిబంధనలు కేవలం GTA+ ప్రచార ఆఫర్‌కు మాత్రమే సంబంధించినవి, గేమ్ లభ్యతకు కాదని పేర్కొన్నారు. అయితే, కొన్ని గల్ఫ్ మార్కెట్లలో గేమ్ విడుదల స్థితిపై అనిశ్చితి కొనసాగుతోందన్నారు. బహ్రెయిన్, ఖతార్, కువైట్ మరియు ఒమన్లలోని ప్లేస్టేషన్ స్టోర్ పేజీలలో గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI జాబితాలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ టైటిల్ కొనుగోలుకు అందుబాటులో లేదని చూపిస్తోంది. దీనిని బట్టి స్థానిక అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదని లేదా ఆంక్షలను ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది.
దీనికి విరుద్ధంగా, సౌదీ అరేబియా మరియు యూఏఈలలో ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అక్కడ ప్లేస్టేషన్ ఆన్లైన్ స్టోర్‌లో ఈ గేమ్ స్టాండర్డ్ మరియు అల్టిమేట్ ఎడిషన్లు జాబితాలో వివరించారు.
డెవలపర్ రాక్‌స్టార్ గేమ్స్, గ్రాండ్ థెఫ్ట్ ఆటో VI విడుదలను ప్లేస్టేషన్ 5 మరియు PS5 ప్రో కోసం నవంబర్ 19, 2026న షెడ్యూల్ చేసింది. రాక్‌స్టార్, పబ్లిషర్ టేక్-టూ ఇంటరాక్టివ్, లేదా గల్ఫ్ రెగ్యులేటర్లు ఎవరూ కూడా బహ్రెయిన్, ఖతార్, కువైట్ లేదా ఒమన్లలో ఈ గేమ్‌పై నిషేధాన్ని బహిరంగంగా ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇక పై పక్కా నిఘా







