కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- June 27, 2026
కువైట్: షిప్పింగ్ మార్గాల ద్వారా కువైట్ లోకి ప్రవేశించే డ్రగ్స్ ను అడ్డుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ తో కలిసి ఒక సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది.
ఈ క్రమంలో ఒక కొరియర్ కంపెనీ ద్వారా వచ్చిన పార్సిల్ లో అనుమానాస్పద డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పార్సిల్ ను స్వీకరిస్తున్న సమయంలోనే జులైబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో ఒక బంగ్లాదేశీ జాతీయుడిని అరెస్టు చేశారు.
పార్సిల్ ను తనిఖీ చేయగా, రసాయన డ్రగ్స్ తో తడిపిన 80 కాగితాలను గుర్తించారు. ఆ తర్వాత అనుమానితుడి నివాసంలో సోదాలు చేయగా, అవే రకానికి చెందిన ఇతర పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి ఈ డ్రగ్ రాకెట్ వెనుక ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







