భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- September 28, 2026
దుబాయ్: భారత కాన్సుల్ జనరల్ డా.ఈ.విష్ణువర్ధన్ రెడ్డి షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్మన్ అబ్దుల్లా సుల్తాన్ అల్ ఒవైస్‌తో సమావేశమయ్యారు. సోమవారం జరిగిన ఈ భేటీలో భారత్–షార్జా మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఇరువురు చర్చించారు.
భారత్–షార్జా మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, ఇరు ప్రాంతాల వ్యాపార వర్గాలకు కొత్త అవకాశాలను కల్పించే అంశాలపై సమావేశంలో చర్చించినట్లు భారత కాన్సులేట్ జనరల్, దుబాయ్ వెల్లడించింది.
పెట్టుబడులను ప్రోత్సహించడం, వ్యాపార సంబంధాలను విస్తరించడం, ఆర్థిక సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా భారత్–షార్జా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి.

తాజా వార్తలు
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!







