రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- September 28, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రధాని సురక్ష బీమా యోజన అందిస్తోంది. ఏడాదికి కేవలం ఇరవై రూపాయల అతి తక్కువ ప్రీమియంతో ప్రమాదాల సమయాలలో కుటుంబానికి ఆర్థిక ధైర్యం లభిస్తుంది. సామాన్య కుటుంబాలు సైతం ఈ సేవను సులభంగా పొందేలా ఈ పథకం రూపకల్పన జరిగింది.
ఎవరెవరు అర్హులుంటరు
పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు పరిమితి కలిగిన ప్రతి ఒక్కరు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నవారు ఎవరైనా దీనిని ఎంచుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఆటో డెబిట్ విధానం ద్వారా ఈ చిన్న మొత్తం ఖాతా నుంచి నేరుగా జమ అవుతుంది.
ఏయే ప్రమాదాలకు వర్తిస్తది
రోడ్డు ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా మరణం లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు రెండు లక్షల రూపాయల వరకు కవరేజ్ అందుతుంది. ఆత్మహత్య వంటి ఘటనలకు ఈ పథకం వర్తించదు. ఈ అద్భుతమైన అవకాశం ద్వారా ప్రతి ఒక్కరు సులభంగా తమ భవిష్యత్తుకు రక్షణ కల్పించుకోవచ్చు.
తాజా వార్తలు
- బంగాళాఖాతంలో భీకర తుపాను.. ఏపీ తీర ప్రాంతాలకు హై అలర్ట్..
- విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్ న్యూస్!!
- రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..
- పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ
- దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!







